గతంలో మణిపూర్ ను గాలికొదిలేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో పర్యటించిన మోడీ.. 4వేల 800 కోట్ల విలువైన 22 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ప్రధాని కాకముందు మణిపూర్ అనేకసార్లు వచ్చానని... ఇక్కడి ప్రజల బాధలు తనకు తెలుసన్నారు. అందుకే తాను ప్రధాని అయ్యాక... మొత్తం భారత ప్రభుత్వాన్ని మణిపూర్ ప్రజల చెంతకు తీసుకొచ్చినట్టు చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు 6 శాతం మణిపురీ ప్రజలకే పైప్ వాటర్ అందిందని.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందన్నారు. 11వేల కోట్ల పామ్ ఆయిల్ మిషన్ తో... ఈశాన్య రాష్ట్రాల రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.
https://twitter.com/ANI/status/1478271516580081664
For More News..