రైతు బంధు పుట్టించిందే నేను: సీఎం కేసీఆర్

రైతు బంధు పుట్టించిందే నేను: సీఎం కేసీఆర్

గతంలో ఎప్పుడైనా రైతులకు రూపాయి ఇచ్చారా.. అప్పుల కోసం మెడపై కత్తి పెట్టినోళ్లే కానీ..ఒక్క సాయం చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు సీఎం కేసీఆర్. రైతు బంధు పథకాన్ని దేశంలోనే  మొదటిసారి తీసుకొచ్చింది..పుట్టించింది నేను అన్నారు సీఎం కేసీఆర్. క్రమపద్దతిలో రైతు బంధును 16 వేల రూపాయలకు తీసుకెళతామని వెల్లడించారు. 24 గంటలూ పంటలకు కరెంట్, ఇళ్లకు నీళ్లు, కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగటం లేదన్నారు సీఎం కేసీఆర్. 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. మోదీ రాష్ట్రం గుజరాత్ లోనూ 24 గంటల కరెంట్ ఇవ్వటం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తున్నారు.. వాళ్ల దగ్గర మంచినీళ్లకు దిక్కులేదు.. మనకు ఉపన్యాసాలు ఇవ్వటానికి వస్తారు అంటూ చురకలు అంటించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్నాటకలో ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వటం లేదని దుస్థితిలో ఉందన్నారు.</p>

ఎన్నికలు రాగానే ఆగం ఆగం కావొద్దు.. ఎవరెవరో వస్తారు.. మిమ్మల్సి మభ్య పెడతారు.. ఆగం కావొద్దు అని కేసీఆర్ సభ నుద్దే శించి మాట్లాడారు. ఉద్యమంలో లేనోడు కూడా ఇవాళ మాట్లాడుతున్నాడు..కొడంగల్ కు రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా అని  సవాల్ విసురు తున్నారు.. కేసీఆర్ దమ్మేందో దేశం మొత్తం చూసిందని అన్నారు కేసీఆర్. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉండాలన్నా.. రైతు బంధు అమలు కావాలన్నా..  ఆసరా పింఛన్లు రావాలన్నా..  నవంబర్ 30 న దుమ్ము రేపాలి.. మళ్లీ బీఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకురావాలని ప్రజలను కోరారు కేసీఆర్.