శభాష్ డాక్టర్లు:హరీష్ రావు

శభాష్ డాక్టర్లు:హరీష్ రావు

ఒకప్పుడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు సర్కారు దవాఖానలో వైద్యం కోసం వెళ్ళాలంటే వైద్యులు, సిబ్బంది పట్టించుకునే వారనే కాదు. కనీస సౌకర్యాలు ఉండవు అనే భావనలో అప్పు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకునేవారు. వైద్యానికి లక్షలు ఖర్చుచేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో సర్కారు దవాఖానల్లో రూపు రేఖలు మారిపోయాయి. వైద్యులు, సిబ్బంది, మౌళిక వసతులు, సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.

జనగామ జిల్లాలోని MCH హాస్పిటల్ లో ఒకే రోజు 35 ప్రసవాలు జరిగాయి. నిబద్ధత, అంకితభావంతో ప్రసవాలు చేసినందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వైద్యులు, సిబ్బందిని అభినందించారు. డాక్టర్లు విధుల పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారని కొనియాడారు.