- ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోయా
- సరిగా పనిచేయలేకపోయానని బాధకలుగుతోంది
- డిసెంబర్ నెల జీతం ఆపేయండి
- మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా కలెక్టర్ కరంవీర్ శర్మ లేఖ
భోపాల్: ప్రజా సమస్యలు పరిష్కరిండంలో విఫలమయ్యానని తనకు వచ్చే.. నెల జీతాన్ని నిలిపివేయాలని జిల్లా కోశాధికారికి ఓ కలెక్టర్ లేఖ రాశారు. తన జీతమే కాకుండా కిందిస్థాయి ఉద్యోగుల సాలరీ కూడా ఆపాలని సూచించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. శాఖల వారీగా రివ్యూ నిర్వహించిన కలెక్టర్ కరంవీర్ శర్మ.. రెవెన్యూ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెవెన్యూ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న తహశీల్దార్ కు ఇంక్రిమెంట్ కట్ చేయాలని ఆదేశించారు. సమీక్షకు హాజరుకాని జిల్లా మార్కెటింగ్ అధికారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సీఎం హెల్ఫ్ లైన్ కు అందిన ఫిర్యాదులు వంద రోజులు దాటినా పరిష్కారం కాకపోవడంతో అధికారుల వేతనాన్ని కూడా నిలిపివేశారు. బాధితుల సమస్యలు తీర్చడంలో విఫలమైనందుకు డిసెంబర్ నెలలో పనిచేయలేదన్న భావనతో నెల జీతాన్ని నిలిపివేయాలని ట్రెజరరీ అధికారులకు లేఖ రాశారు కలెక్టర్.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ ఫాం హౌజ్ లో వరి సాగుపై రచ్చ
హలీం ప్రియులకు శుభవార్త.. 2 నిమిషాల్లో రెడీ