
నేను జనసేన(Janasena) పార్టీలో చేరతానని అనలేదు. నేను తుమ్మినా దగ్గినా వివాదాస్పదం చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి అడిగితే సమాధానం ఇచ్చానంతే. నాయకుడు నచ్చి, అజెండా నచ్చితే ప్రోత్సహిస్తానని మాత్రమే చెప్పా. అంతే కానీ పార్టీలో చేరతానని చెప్పలేదు. జనసేన పార్టీ అజెండా నాకెంతో నచ్చిన విషయం మాత్రం చెప్పా.. అంటోంది యాంకర్, నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj).
ఈ నేపథ్యంలో జనసేన ఆమెతో ప్రచారం చేయిస్తే బాగుంటుందన్న చర్చ జరిగింది. సోషల్ మీడియాలో జనసైనికులు చాలామంది ఆమె గురించి పాజిటివ్ కామెంట్లు చేశారు. కొందరైతే ఆమెను జనసైనికురాలిగా పేర్కొంటూ.. త్వరలో జనసేనలో చేరుతుందనే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఐతే తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా జనాలకు ఒక సందేశం పంపింది అనసూయ. తాను జనసేనలో చేరతానని చెప్పలేదంటూ క్లారిటీ ఇచ్చింది.