
బిల్ గేట్స్.. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్..ప్రపంచ కుబేరుల్లో ఒకరు.తరుచుగా ఇండియాలో పర్యటించేందుకు ఆసక్తి చూపే బిల్ గేట్స్..ఇటీవల ఇండియాలో పర్యటించిన క్రమంలో జెరోదా సంస్థ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఈ పాడ్కాస్ట్లో బిల్గేట్స్ తన గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఓ సెటిల్ మెంట్ పొందాలనుకునేవారికి లేదా ఓ స్థాయికి ఎదగాలనుకునేవారికి కష్టపడి పనిచేయడం, స్వీయ క్రమశిక్షణ చాలా ముఖ్యం అన్నారు బిల్ గేట్స్. 2014 ఏప్రిల్ లో నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో మొదటిసారి పాల్గొన్న బిల్గేట్స్ .. తాజా ఇండియా పర్యటనలో మరో ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పని సంస్కృతి, భారత దేశంలో పర్యటనలు, తన సంపాదన వెనక ఉన్న తత్వమేంటీ వంటి అనేక అంశాలను ఈ పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు.
చర్చలో భాగంగా పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. బిల్ గేట్స్ భారత్ పర్యటనలో చాలా హడావుడిగా, తొందరపడతారు..తరుచుగా ప్రముఖ రాజకీయ నేతలు, షేర్ హోల్డర్లతో సమావేశం అవుతుంటారు.ఎందుకలా అని ప్రశ్నంచగా.. బిల్ గేట్ ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘చాలా సరదాగా అనిపిస్తుంది..మీరు కష్టపడి పనిచేయాలనుకున్నపుడు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు.. మీ విషయంలో మీరు చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని’’ అన్నారు.
బిల్ గేట్స్ ఇండియాలో చాలాసార్లు పర్యటించారు. గత పర్యటనలో ఆయన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు జేపీనడ్డా, హర్దీప్ సింగ్ పూరి, జితేంద్ర సింగ్ వంటి ప్రముఖులను కలిశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, అభివృద్ధి,ఆవిష్కరణల గురించి చర్చించారు.
ఈ ఎపిసోడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆయన పదవీ విరమణ గురించి చర్చించారు కామత్. ‘‘ వ్యాపార దృష్టిలో చూసినప్పుడు ఒక దేశం అతిపెద్ద జనాభా కలిగి ఉండటం లాభమా లేక సవాల్ గా అనుకోవచ్చా అని కామత్ ప్రశ్నించారు. దీని గేట్స్ సమాధానం చెపుతూ.. రాబోయే రెండు దశాబ్దాల్లో అంతా AI ప్రభావమే ఉంటుందన్నారు. ‘‘ మీరు ముందుగానే రిటైర్డ్ కావొచ్చు.. తక్కువ పనిదినాలు పనిచేయొచ్చు..సమయాన్ని ఎలా గడపాలా అనే దానిపై ఓ తాత్విక ఆలోచన అవసరం అన్నారు బిల్ గేట్స్.
అయితే AI లో ప్రజలకు పనిలేకుండా పోతే ఎలా అని అడిగిన ప్రశ్నకు గేట్స్ సమాధానం ఇస్తూ అలాంటి తానేం చేస్తాడో చెప్పారు. తాను పని లేకపోతే పనిని సృష్టించుకుంటానని చెప్పారు. ప్రజలు కూడా AI తో మార్పులతో పోటీ పడుతున్నారని అన్నారు.
WTF పీపుల్ పాడ్‌కాస్ట్‌ను కామత్ గత సంవత్సరం ప్రారంభించారు. బిల్ గేట్స్ మొదటి అతిథిగా ఇంటర్వ్యూ నిర్వహించారు. మొదటి ఎపిసోడ్‌లో గేట్స్ భారతదేశంతో తనకున్న అనుబంధం, అక్కడి పనిచేసే వ్యక్తులను ఎంతగా విలువైనవారుగా భావిస్తారో పంచుకున్నారు.