నాకు ఇక అమెరికాలో ఫ్యూచర్ లేదు.. మస్క్ కుమార్తె

నాకు ఇక అమెరికాలో ఫ్యూచర్ లేదు.. మస్క్ కుమార్తె

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో  డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ గెలవడంపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్రాన్స్‌‌జెండర్ కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇక తనకు, తనలాంటి ట్రాన్స్‌‌జెండర్లకు అమెరికాలో ఫ్యూచరే లేదని తేలిపోయిందని పేర్కొంది.

‘నేను కొన్నేండ్లుగా భయపడుతున్నదే ఇప్పుడు నిజమైంది. ట్రంప్‌‌ నాలుగేండ్లు అమెరికా అధ్యక్షుడిగా ఉండనున్నాడు. దేశంలో ట్రాన్స్‌‌జెండర్ల వ్యతిరేక నిబంధనలు ఇప్పుడు ఒక్కసారిగా అమల్లోకి రాకపోవచ్చు. కానీ, యాంటీ-ట్రాన్స్ రూల్స్ కావాలని ఓటేసినవాళ్ల ఉద్దేశం అంత తొందరగా మారదు. ట్రంప్ గెలుపుతో ఇకపై ట్రాన్స్‌‌ జెండర్లకు అమెరికాలో భవిష్యత్తు లేదనే విషయం స్పష్టమైంది’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ థ్రెడ్‌‌లో ఓ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌‌ వైరల్‌‌ కావడంతో దీనిపై మస్క్ కూడా స్పందించారు. 'నా కొడుకుని ఓక్ మైండ్సెట్ అనే వైరస్  చంపేసింది' అని ట్వీట్ చేశారు.