నాకు ఓపెన్ AIపై నమ్మకం లేదు:ఎలన్ మస్క్ కామెంట్లతో రచ్చ రచ్చ

నాకు ఓపెన్ AIపై నమ్మకం లేదు:ఎలన్ మస్క్ కామెంట్లతో రచ్చ రచ్చ

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు..Open AI ChatGPTపై నాకు నమ్మకంలేదని బాంబ్ పేల్చారు.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చాట్ జీపీటీని వాడుతున్నారు..ఎలాన్  మస్క్ ఇలా అంటున్నారేంది అని ఆశ్చర్యం కలుగుతుందా..ఎలాన్ మస్క్ నిజంగా ఆ వ్యాఖ్యలు చేశాడు..నిజంగా మనం ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని నమ్మలేమా..?   

టెస్లా,స్పెస్ X సీఈవో ఎలాన్ మస్క్, ఓపెన్AI చాట్ జీపీటీ అధినేత సామ్ ఆల్ట్ మన్ ల వివాదం గురించి మనకు తెలిసిందే..వీరిద్దరు ఎప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లతో విమర్శలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం..ఇద్దరు బిలియనీర్ల మధ్య ఈ సోషల్ మీడియా విమర్శనాస్త్రాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కౌంటర్ ఎటాక్స్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటారు. తాజాగా  ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్ మన్ మధ్య మరో వివాదం నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. 

Open AI ChatGPTని తనకు అమ్మాలని ఎలాన్ మస్క్, అతని బిజినెస్ గ్రూప్..చాట్ జీపీటీ ఓనర్ సామ్ ఆల్ట్ మన్ ను సోషల్ మీడియా వేదిక అడిగారు.. దీంతో ఆల్ట్ మన్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎలాన్ మస్క్ బిడ్ ను తిరస్కరించారు. ఈ ఆఫ‌ర్‌ని తిరస్కరించిన తర్వాత మస్క్.. ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ అల్ట్ మన్ లక్ష్యంగా వరుస సోషల్ మీడియా పోస్ట్‌లు షేర్ చేశారు. 

ఓపెన్ AI చాట్ జీపీటీని 97.4బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తాం.. అమ్ముతావా అని  తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో ఎలాన్ మస్క్ ప్రతిపాదనను ఆల్టమన్ చెప్పారు.. మస్క్ ప్రతిపాదనకు సామ్ ఆల్ట్ మన్ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. కావాలంటే నువ్వే నాకు ట్విట్టర్ ను 9.74 బిలియన్ లకు ఇస్తే కొనుగోలు చేస్తాను అని సమాధానమిచ్చారు. 

ఇక మరో ట్వీట్ లో ఎలాన్ మస్క్ సామ్ అల్ట్ మన్ పై విరుచుకున్నారు. మోసగాడు. అంటే ఆల్టమ్ ణ్ నుద్దేశించి రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ మస్క్, ఆల్టమన్ మధ్య తాజా వివాదాన్ని ముదిరేలా చేసింది. 

2015 లో ఇద్దరు కలిసి ఓపెన్ ఏఐ ని స్టార్ట్ చేశారు.. తర్వాత ఎవరు దీనిని నడిపించాలి అని పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఓపెన్ AI పై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. 

ఓపెన్ AI దండగా దానితో ఎటువంటి లాభం లేదు.. నేను ఓపెన్ AI  ని నమ్మను అని ఎలాన్ మస్క్ ఈ పోస్టుకు యాడ్ చేశాడు.. దీంతో ఇద్దరి మధ్య ఉన్న వివాదం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.