విద్యార్థుల్ని ముందుగానే ఎందుకు తీసుకురాలే?

విద్యార్థుల్ని ముందుగానే ఎందుకు తీసుకురాలే?

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులపై స్పందించారు బెంగాల్ సీఎం మమత బెనర్జీ. విదేశీ వ్యవహారల విషయంలో తాను భారత ప్రభుత్వాన్ని విమర్శించాలనుకోవడం లేదన్నారు. ఎందుకంటే మనమంతా ఒక్కటే అన్నారు మమత. కానీ కొన్నిసార్లు బాహ్య వ్యవహారాలు ముఖ్యమైనవి  అన్నారామె. ఇతర దేశాలతో రాజకీయ,వ్యాపారాల కారణంగా మనకు  కొంత సమన్వయ లోపం ఏర్పడి మనం వెనకబడి ఉన్నామన్నారు. మన విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

ఉక్రెయిన్‌లో కొందరు చనిపోయారన్నారు. మరికొందరిని ఇతర దేశాలకు తరలిస్తున్నారన్నారు. కొందరు బంకర్లలో వేచి ఉంటే.. మరికొందరు రోమేనియాలో వేచి ఉన్నారు. కొందరికి ఆహారం కూడా సరిగా అందడం లేదన్నారు. ఎవరైతే ఆహారం కోసం బయటకు వస్తున్నారు వాళ్లు చనిపోతున్నారన్నారు సీఎం మమత. ప్రభుత్వానికి జరుగుతున్న పరిణామాలు గురించి తెలిసినా కూడా విద్యార్థులను ముందుగా ఎందుకు తీసుకురాలేదు? అని మమత ప్రశ్నించారు. 

మరోవైపు బెంగాల్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికలపై కూడా మమత మాట్లాడారు. డార్జిలింగ్‌లో ప్రజాస్వామ్యం పునరుజ్జీవం పొందినందుకు సంతోషంగా ఉందన్నారామ. ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు పార్టీలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. త్వరలో GTA (గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్) ఎన్నికలను కలిగి ఉంటామని తెలిపారు. ఈ ఘనవిజయం ప్రజల కోసం మరింత పని చేసేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తోందన్నారు సీఎం.  పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 108 మునిసిపాలిటీలలో 102 కైవసం చేసుకుంది. టీఎంసీ గెలిచిన 102 ప్రజా సంఘాలలో 31 మున్సిపాలిటీల్లో ప్రతిపక్షం లేదు. TMC చీఫ్ మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు.