ఇండోెర్: మాస్క్ కట్టుకోకుంటే ఏమవుతుందని, తాను మాస్కు ధరించనని మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తం మిశ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బుధవారం ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నరోత్తం మిశ్రా మాస్కు లేకుండా కనిపించారు. స్టేట్ గవర్నమెంట్ పథకమైన సంబాల్ యోజన కింద పేద ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ వారికి సాయం చేసే కార్యక్రమంలో నరోత్తం పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో గుమిగూడిన కొందరు ప్రజలు, రిపోర్టర్ల మధ్య నరోత్తం మాస్కు కట్టుకోకుండా మాట్లాడటం గమనార్హం. ‘ఇలాంటి ఈవెంట్ల సమయంలో నేను మాస్కులు కట్టుకోను. కట్టుకోకుంటే ఏమవుతుంది? నేను మాస్కు కట్టుకోను’ అని నరోత్తం పేర్కొన్నారు.
#WATCH Madhya Pradesh Home Minister Narottam Mishra says, "I don't wear it" when asked why is he not wearing a mask at an event in Indore. (23.09.2020) pic.twitter.com/vQRyNiG3ES
— ANI (@ANI) September 24, 2020
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నరోత్తం క్షమాపణలు చెప్పారు. ఇప్పటి నుంచి మాస్కు కట్టుకుంటానన్నారు. ‘సాధారణంగా నేను మాస్కు కట్టుకుంటా. కానీ దాన్ని ఎక్కువ సేపు వేసుకోవడం నా వల్ల కాదు. పాలీపస్‌తో బాధపడుతున్నా కాబట్టి నాకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి’ అని నరోత్తం వివరణ ఇచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో హోం మినిస్టర్‌గా ఉన్న నరోత్తం.. మరికొన్ని పోర్ట్‌ఫోలియోలను కూడా చూసుకుంటున్నారు.
मास्क पहनने के बारे में मेरे बयान से कानून की अवहेलना महसूस हुई है। यह माननीय प्रधानमंत्री जी की भावना के अनुरूप नहीं था। मैं अपनी गलती मानते हुए खेद प्रकट करता हूँ। मैं स्वयं भी मास्क पहनूंगा। समाज से भी अपील करूंगा कि सभी मास्क पहनें और सोशल डिस्टेंसिंग के नियमों का पालन करें।
— Dr Narottam Mishra (@drnarottammisra) September 24, 2020