ఇవాళ వరల్డ్ స్ట్రోక్ డే
హెల్ప్ లైన్ నెంబర్:105910
బ్రెయిన్ స్ట్రోక్. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఉన్నట్టుండి ఒక్కసారిగా వికలాంగుడిగా మార్చేస్తుంది. చివరకు ప్రాణాలు కూడా తీస్తుంది. కానీ స్ట్రోక్ వచ్చినా.. సింప్టమ్స్ కనిపించినా రోగిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళితే ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రోజు వరల్డ్ స్ట్రోక్ డే. నలభై ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని గుర్తుచేస్తున్న రోజు.
ముందే గుర్తించాలి
బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైనదే అయినా దాన్ని ముందే గుర్తిస్తే పెద్ద ప్రమాదం నుంచి బయటపడొచ్చు. చేతులు, కాళ్లు వంకర్లు తిరుగుతున్నా.. ఎక్కువ నీరసంగా ఉన్నా.. మాట్లాడటం కష్టమవుతున్నా.. వెంటనే అలర్ట్ అవ్వాలి. ఒక్కోసారి ఈ సింప్టమ్స్ తో పాటు తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు కూడా ఉంటాయి. ఎవరికి వారే ఈ లక్షణాలను గుర్తించొచ్చు. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.
కారణాలివే..
మెదడు పనిచేయకపోవడమనేది అకస్మాత్తుగా జరిగినా..శరీరంలో సంభవించిన కొన్ని మార్పుల వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. దానికి స్మోకింగ్, డ్రింకింగ్తో పాటు హై బీపీ, షుగర్, అధిక కొలెస్ట్రాల్ వంటివి తోడైతే మరింత ప్రమాదం. వారసత్వంగా కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.
హాస్పిటల్కి వెళ్లాలి
స్ట్రోక్ వచ్చినవాళ్లను సరైన టైంలో హాస్పిటల్ కు తీసుకెళ్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. ఏ మాత్రం ఆలస్యమైనా మెదడుకు రక్తనాణాలు చిట్లి పక్షవాతం వస్తుంది. ఇలా జరిగినప్పుడు నెమ్మదినెమ్మదిగా మెదడులోని కణాలు ఆక్సిజన్ అందక చనిపోతూ ఉంటాయి. పక్షవాతం వచ్చిన మూడు నుంచి నాలుగు గంటల తరువాత ఈ కణాలన్నీ పూర్తిగా చనిపోతాయి. అందువల్ల వెంటనే డాక్టర్ను కలవాలి.
ఇంజెక్షన్ ఉంది..
ఒకప్పుడు పక్షవాతం వచ్చిందంటే జీవితాంతం అలాగే ఉండిపోయేవారు. ఇప్పుడు దీనికి సరైన ట్రీట్ మెంట్ వచ్చింది. కాదంటే దానిపై సరైన అవగాహన లేదు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయినా.. కాళ్ళు చేతులు పనిచేయలేకపోయినా వెంటనే న్యూరాలజిస్ట్ ను కలవాలి. స్ట్రో క్ వచ్చిన వెంటనే హెల్ప్ లైన్ నెంబర్105910 కు ఫోన్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. పక్షవాతం వచ్చిన వ్యక్తి శరీర బరువును బట్టి ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల 50 శాతం రోగుల్లో వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఇంజెక్షన్ బాగా ఎక్స్ పీరియెన్స్ ఉన్న న్యూరాలజిస్ట్ లే ఇవ్వాలి. అందుకని ఆ డాక్టర్లు ఉన్న హాస్పిటల్ కే వెళ్లాలి.–డాక్టర్ చిట్టెల సీత, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, హైదరాబాద్
for more news…..