తమిళ అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), కన్నడ అభిమానులకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్‌సీబీ).. ఈ రెండు దేనికవే ప్రత్యేకం. ఊహించని ఫలితాలతో సీఎస్‌కే అభిమానులకు మరింత దగ్గరవుతుంటే.. టైటిల్ గెలవకపోయినా ఆర్‌సీబీ ఆటగాళ్లు వారి పోరాటపటిమతో అభిమానుల మనసు కొల్లగొడుతున్నారు.
మరి రెండు తెలుగు రాష్ట్రాల అభిమాన జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం. ఒకప్పుడు హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లలో కాసింత బెరుకు కనిపించేది. కానీ ఇప్పడు సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అంటే గెలుపు తమదే అన్న ధీమాతో బరిలోకి దిగుతున్నాయి. గత నాలుగు సీజన్లుగా ఎస్ఆర్‌హెచ్ జట్టు.. పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీపడుతోంది. ఎన్ని కోట్లు వెచ్చించినా.. ఎంత మంది నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసినా.. ఫలితంలో మాత్రం మార్పు ఉండటం లేదు.
కావ్య మారన్ బాధపడుతుంటే తట్టుకోలేకపోయా
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు మ్యాచులు ఓడిపోయినా తట్టుకున్నారు గానీ.. కావ్య మారన్ బాధపడుతుంటే మాత్రం కొందరు అభిమానులు తట్టుకోలేకపోయారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసైనా దేవుడు కరుణించాలని పార్థించని అభిమాని లేరు. అలా కావ్య మారన్ బాధపడుతుంటే తట్టుకోలేకపోయిన వారిలో తాను కూడా ఒక్కరినని చెప్పుకొచ్చారు.. సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్ ఆడియో రిలీజ్ సంధర్బంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Rajnikanth : Kalanithi Maran should put good players in SRH team. I feel bad seeing Kavya Maran like that in TV ?#WhistlePodu #IPL #Rajinikanth pic.twitter.com/HNOzEOKP5R
— CSK Fans Army™ (@CSKFansArmy) July 28, 2023
సన్‌రైజర్స్ ఓటముల తర్వాత గ్రౌండ్‌లో జట్టు సీఈవో కావ్య మారన్‌ను అలా చూడలేకపోయానని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. మరోసారి ఆ తప్పు పునరావృతం కానివ్వొద్దని కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌కు తలైవా సూచించారు. కావ్యను బాధ పెట్టకుండా వచ్చే సీజన్‌లోనైనా జట్టులోకి మంచి ఆటగాళ్లను తీసుకోవాలని తెలిపారు.
Superstar Rajinikanth said, "Kalanithi Maran should put good players in Sunrisers Hyderabad team. I feel bad seeing Kavya like that on TV during the IPL". pic.twitter.com/yTj56Nus0i
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 28, 2023
ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్‌హెచ్.. కేవలం 4 విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది.