డ్రీమ్ కమ్ ట్రూ.. ఈ మాట మహేష్ బాబు నోటి వెంట వచ్చిన సందర్భం ఇది

డ్రీమ్ కమ్ ట్రూ.. ఈ మాట మహేష్ బాబు నోటి వెంట వచ్చిన సందర్భం ఇది

‘ముఫాసా: ది లయన్ కింగ్‌‌’ సినిమాలోని లీడ్ క్యారెక్టర్‌‌‌‌కు వాయిస్ చెప్పడం పట్ల హీరో మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. మహేష్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు వచ్చిన అత్యంత పాపులర్ క్యారెక్టర్స్‌‌లో ముఫాసా ఒకటి. నేను ఎప్పటి నుంచో చూస్తున్న పాత్రల్లో ఆ పాత్ర ఒకటి.  ముఫాసా తన కుటుంబాన్ని చూసుకునే విధానం అద్భుతం. అందుకే ఈ అవకాశాన్ని డ్రీమ్ కమ్ ట్రూలా భావిస్తున్నా. నిజంగా నాకిది ఓ గౌరవం.

ప్రేక్షకులు తమ ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తారని భావిస్తున్నా’ అని చెప్పారు.  ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్‌‌లో టాకా పాత్రకు హీరో సత్యదేవ్‌‌, టిమోన్‌‌కు అలీ, పుంబాకు బ్రహ్మానందం, కిరోస్‌‌ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ చెప్పారు. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20న ఇంగ్లీష్‌‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.