ప్రముఖ పారిశ్రామి వేత్త, ఇండియన్ బిలియనీర్ అదానీ వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో దుమారం రేగింది. అదానీతో సీఎం ఎంకే స్టాలిన్ కు సంబంధాలు న్నాయని దీనిపై ఆయన సమాధానం చెప్పాలని పీఎంకే నేత పట్టుబట్టారు. దీనిపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.
మంగళవారం ( డిసెంబర్10) తమిళనాడు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా మాటల యుద్ధం సాగింది. అదానీతో సీఎం ఎంకే స్టాలిన్ కు సంబంధాలున్నాయని ప్రతిప క్ష పార్టీ పీఎంకే నేతలు ఆరోపించారు.
ALSO READ | రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
ఈ విషయంపై స్టాలిన్ స్పందిస్తూ.. తాను ఎప్పుడు గౌతమ్ అదానీని కలవలేదని.. అదాని విషయంలో తన ప్రమేశం లేదని .. ఇదే విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి సెంథిల బాలాజీ ఇప్పటికే చెప్పారు.
అదానీ అంశంపై సంయుక్త పార్లెమంటరీ కమిటి(జేపీసీ) విచారణ బీజేపీ, పీఎంకేలు సిద్దమేనా అని సవాల్ విసిరారు.