Rohit Sharma: నేను రిటైర్‌ అవ్వలేదు.. రెస్ట్ మాత్రమే.. మౌనం వీడిన రోహిత్ శర్మ

Rohit Sharma: నేను రిటైర్‌ అవ్వలేదు.. రెస్ట్ మాత్రమే.. మౌనం వీడిన రోహిత్ శర్మ

సిడ్నీ టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫేలవ ఫామ్ నేపథ్యంలో కోచ్‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌ అతనిపై వేటు వేశాడని, బాక్సింగ్ డే టెస్టుతో హిట్‌‌‌‌మ్యాన్ టెస్టు కెరీర్‌‌‌‌‌‌‌‌ ముగిసిందంటూ కథలనలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో హిట్ మ్యాన్ స్పందించాడు. తాను టెస్టులకు వీడ్కోలు పలకనున్నారనే కథనాలు అవాస్తవమని తెలిపాడు. 

రెండవ రోజు లంచ్ విరామంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రోహిత్.. ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు. మరికొంత కాలం టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగాలనుకున్నట్లు తెలిపాడు. సిడ్నీ టెస్టు మ్యాచ్‌ నుంచి తాను వైదొలగడం వెనుకున్న కారణాన్ని రోహిత్ వివరించాడు. 

Also Read :- వేటు కాదు విశ్రాంతి.. తుది జట్టులో రోహిత్‌‌‌‌ లేకపోవడంపై బుమ్రా

'నేను రిటైర్ కాలేదు, ఈ మ్యాచ్ నుండి మాత్రమే ఇప్పుడే తప్పుకున్నాను" అని స్పోర్ట్స్ ప్రెజెంటర్ జతిన్ సప్రూ, భారత మాజీ క్రికెటర్/ కామెంటెటర్ ఇర్ఫాన్ పఠాన్‌లతో చెప్పాడు.

'నేను ఫామ్‌లో లేను.. పరుగులు రావడం లేదు.. విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. ఆ విషయాన్ని కోచ్‌కు, సెలెక్టర్లకు చెప్పాను. వారు నా నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. నేను చాలా కాలంగా ఆడుతున్నాను. జట్టుకు ఏది మంచిదో నాకు తెలుసు..' అని రోహిత్ పేర్కొన్నాడు.

రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో సిడ్నీ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు.