క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఉపయోగించే అనేక రకాల వస్తువుల్లో బెల్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవుల సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చేసే మొదటి సేవను, ఫస్ట్ సర్విస్ టు గాడ్ అంటారు. పాతకాలపు కాథలిక్ చర్చిల్లో కూడా సూర్యాస్తమయం తరువాతనే సేవలు మొదలవుతాయి. ఇందుకు గుర్తుగా గంటలు మోగించే వారు వాళ్లు. చర్చి గంటలు మోగాయి అంటే చర్చి సేవలు మొదలయ్యాయి అని అర్థం.
ఇక కొన్ని దేశాల్లోని చర్చిల్లో పండుగ వచ్చే అర్థరాత్రికి సరిగ్గా గంట ముందు చర్చిలోని అన్నింటి కంటే పెద్ద గంటను నాలుగు సార్లు మోగించి, సరిగ్గా అర్థరాత్రి రాగానే చర్చిలోని అన్ని గంటలను ఒకేసారి మోగిస్తారు. క్రిస్మస్ వచ్చింది ఇక సేవలు మొదలు పెట్టండి అనేందుకు చిహ్నంగా ఇలా మోగిస్తారు. ఇక కొన్ని దేశాల్లో చర్చి సేవల్లో పాల్గొనేందుకు చేతిలో చిన్న గంటలు పట్టుకుని తోటి వారితో కలిసి పాడుతుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో ఈ విధంగా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రతీ ఒక్కరు చేతిలోని గంటలు మోగిస్తూ, దేవుని పాటలు పాడు తుంటారు.
దానికి తగినట్టుగా చర్చి గంటలు కూడా మోగుతుంటాయి.. ఇక కొన్ని దేశాల్లో క్రిస్మస్ సమయంలో అర్థరా త్రి జరిగే సేవల్లో పాల్గొనడం మంచి శకునంగా భావిస్తారు. పొరపాటున కూడా ఎవరూ ఈ సేవలు మిస్ అవకూడదనే ఉద్దేశంతో సేవలు ప్రారంభం అయ్యే గంటముందు నుంచి చర్చి గంటలు మోగించేవారు. ఇలా అనేక సందర్భాల్లో క్రిస్మస్ సమయంలో మాత్రమే వీటిని అధికంగా మోగించే వాళ్లు కాబట్టి కాల క్రమంలో అవి క్రిస్మస్ బెల్స్ అయ్యాయి..