త్రీ లాంగ్వేజ్ పాలసీ మంచిదే: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి

త్రీ లాంగ్వేజ్ పాలసీ మంచిదే: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి

న్యూఢిల్లీ: జాతీయ విద్యావిధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్  కోఫౌండర్  నారాయణమూర్తి భార్య సుధామూర్తి మద్దతు తెలిపారు. త్రిభాషా విధానంతో పిల్లలు చాలా నేర్చుకుంటారని పేర్కొన్నారు. దానికి తానే ఉదాహరణ అని అన్నారు. బుధవారం ఓ వార్తా సంస్థతో సుధామూర్తి మాట్లాడారు. 

‘‘నాకు ఏడెనిమిది భాషలు తెలుసు. నేర్చుకోవడమంటే నాకు చాలా ఇష్టం. త్రీ లాంగ్వేజ్ విధానంతో పిల్లలకూ నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఎక్కువ భాషలు నేర్చుకునేలా ఆ విధానం ప్రోత్సహిస్తుంది” అని సుధామూర్తి వ్యాఖ్యానించారు. త్రిభాషా విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.