ఇదేం పోయే కాలం: బాబర్ ఆజంను పెళ్లాడతా అంటున్న రమీజ్ రాజా

ఇదేం పోయే కాలం: బాబర్ ఆజంను పెళ్లాడతా అంటున్న రమీజ్ రాజా

పాకిస్తాన్ క్రికెటర్లు ఇంగ్లీష్‌లో వీక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే మ్యాన్ అఫ్ ది మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్ సమయాల్లో ఇంగ్లీష్‌కు బదులుగా వారి భాషలోనే ఎక్కువుగా మాట్లాడుతుంటారు. కాదు కూడదు.. అని తెలియని భాషలో అత్యుత్సాహం ప్రదర్శించారో ఇదిగో ఇలా నలుగురిలో నవ్వుల పాలు కావాల్సి ఉంటుంది.

పాక్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా తన చీప్ కామెంటరీతో నలుగురిలో పరువు పోగొట్టుకున్నాడు. ఇంతకీ అతనేం మాట్లాడాడంటారా!  బాబర్​ అంటే చాలా ఇష్టం.. అతడినే పెళ్లి చేసుకుంటా! అంటూ ప్రేక్షకులకు మతి పోగొట్టే వ్యాఖ్యలు చేశాడు. 

ఏం జరిగిందంటే..?

లంక ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా కొలంబో స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్న బాబర్ ఆజాం.. సోమవారం గాలే టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలి సెంచరీ చేశాడు. 59 బంతుల్లో 104 పరుగులు చేసిన బాబర్.. జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఈ సందర్భంగా కామెంటరీ బాక్స్ లో ఉన్న రమీజ్ రాజా.. బాబర్ పై పొగడ్తలు కురిపించాడు. 

"వాట్ ఏ ఇన్నింగ్స్.. క్లాస్,​ క్వాలిటీ కలగలసిన ఫిఫ్టీ. ఎలాంటి పరిస్థితుల్లో రాణించగలిగిన ఆటగాడు. నేను అతడిని చాలా ప్రేమిస్తున్నా. అవును, అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.." అని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడు ఫన్నీగా కామెంట్ చేసినా.. పాక్ అభిమానులకు అది రుచించలేదు. నెట్టింట రమీజ్​ రాజాను ఏకిపారేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. పాక్ పరువు తీశారంటూ బండబూతులు తిడుతున్నారు.