ఓటీటీలోకి రకుల్ నటించిన ‘ ఐ లవ్ యూ’

ఓటీటీలోకి రకుల్ నటించిన ‘  ఐ లవ్ యూ’


తెలుగులో స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌గా మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం  హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఆమె నటించిన చిత్రాలు థియేటర్స్​లో కాకుండా ఓటీటీలో విడుదల అవుతున్నాయి.  హిందీ చిత్రం‘ఛత్రీవాలి’ ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా,  తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘భూ’ సినిమా కూడా ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు రకుల్ నటించిన మరో మూవీ కూడా డైరెక్ట్​గా ఓటీటీలోకి వస్తోంది.  ఆమె లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన ‘ఐ లవ్ యూ’ చిత్రం ఈ నెల 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవనుంది. రీసెంట్‌‌‌‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.  లవ్ ట్రాక్ తో స్టార్ట్ అయిన ట్రైలర్.. ఒక్కసారిగా థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్లడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. నిఖిల్ మహాజన్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో పవిల్ గులాటి హీరోగా నటించాడు. మరోవైపు త‌‌‌‌మిళంలో అయాలాన్‌‌‌‌, ఇండియ‌‌‌‌న్ 2 సినిమాల్లో న‌‌‌‌టిస్తోంది ర‌‌‌‌కుల్  ప్రీత్‌‌‌‌సింగ్‌‌‌‌.