హైరిస్కులో ఐఫోన్ యూజర్లు

హైరిస్కులో ఐఫోన్ యూజర్లు

న్యూఢిల్లీ: ఐఫోన్ సహా ఆపిల్ ఉత్పత్తులు హైరిస్క్  జోన్ లో ఉన్నాయని ‘ది ఇండియన్  కంప్యూటర్  ఎమర్జెన్సీ రెస్పాన్స్  టీం (సెర్ట్​ ఇన్) హెచ్చరించింది. వివిధ ఆపిల్  ఉత్పత్తులు హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ఈమేరకు ఈ నెల 19న సెర్ట్​ఇన్ ఒక అడ్వైజరీ విడుదల చేసింది. ఐఓఎస్, ఐపాడ్  ఓఎస్, మాక్  ఓఎస్, వాచ్  ఓఎస్, విజన్  ఓఎస్  సహా భారీ ఎత్తున ఆపిల్  సాఫ్ట్ వేర్  వెర్షన్లలో సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంది.

ఆ సాఫ్ట్ వేర్  ఉన్న పరికరాలపై హ్యాకర్లు దాడిచేసి, వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్  చేస్తారని, సిస్టమ్  మీద నియంత్రణ సాధిస్తారని, స్పూఫింగ్  దాడులకు పాల్పడుతారని సెర్ట్​ ఇన్  ఆ అడ్వైజరీలో వివరించింది. ‘‘18 లేదా 17.7కు ముందు ఉన్న ఐఓఎస్  వెర్షన్లు వాడే యూజర్లు డాస్  అటాక్​లకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే, ఆ యూజర్ల సమాచారాన్ని హ్యాకర్లు చోరీచేయవచ్చు. మాక్  ఓఎస్  పాత వెర్షన్లను వాడే యూజర్లకు డేటా మ్యానిపులేషన్  వంటివి ఎదురుకావచ్చు.

టీవీఓఎస్, వాచ్  ఓఎస్  ఉత్పత్తులు వాడే యూజర్లకూ డాస్  దాడులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సఫారీ, ఎక్స్ కోడ్  పాత వెర్షన్లు వాడే యూజర్లకు సెక్యూరిటీ రిస్ట్రిక్షన్, స్పూఫింగ్  సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది”  అని సెర్ట్​ ఇన్  పేర్కొంది.