వయసు పెరుగుతున్న కొద్ది ముఖం మీద ముడుతలు, కళ్లకింద నల్లటి వలయాలు వస్తూనే ఉంటాయ్. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేదు... మెయింటెనెన్స్ ఉంటే చాలు ఏ వయసులోనైనా స్వీట్ సిక్స్టీన్ గా మెరిసిపోవచ్చని టెక్నాలజీ రుజువు చేస్తోంది.
అదెట్లంటే... కళ్లకింద నల్లటి వలయాలు, ముడుతలు తొలగించడానికి ఐ స్టాక్ హరుకా అనే మెషిన్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. ఈ మెషీన్ కళ్లకింద వచ్చే మచ్చలను పోగొట్టడంతో పాటు వయసు పెరగడం వల్ల వచ్చే చారలను కూడా మటుమాయం చేస్తుంది. ఈ మెషిన్ ను రోజుకు మూడు నిమిషాలు వాడితే చాలు. కళ్ల కింద నల్లని వలయాలు, ముడుతలు పోతాయి. ఈ మెషిన్ ధర రూ. 56 వేలు. బ్యాటరీతో పని చేస్తుంది. ఈ బ్యూటీ గాడ్జెట్ ను జపాన్లో తయారుచేశారు.