
ములుగు, వెలుగు : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు తీగెల వంతెనపై మంగళవారం ‘‘ఐ వోట్ ఫర్ ష్యూర్’’ లోగోను స్టూడెంట్లు ప్రదర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ‘సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్’ (స్వీప్) కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా సరస్సులో నీటిలో తేలియాడే విధంగా ‘ఎస్వీఈఈపీ’ లోగోను కూడా ప్రదర్శించారు.
డ్రోన్ కెమెరా ద్వారా ఫొటోలు తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 18ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.సత్యపాల్ రెడ్డి, జడ్పీ సీఈవో ప్రసూన రాణి, డీడబ్ల్యూవో ప్రేమలత, డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య, డీసీవో సర్ధార్ సింగ్, డీసీఎస్వో అరవింద్ రెడ్డి, సీపీవో ప్రకాశ్, డీఏవో గౌస్ హైదర్ తదితరులు పాల్గొన్నారు.