నిజామాబాద్ జిల్లా: మార్పు కోసమే తాను ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసిన తాను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తానని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనవద్ద ఎలాంటి అక్రమ సంపాదన లేనందునే తనపై ఎలాంటి రైడ్స్ జరగడం లేదని కేఏ పాల్ వెల్లడించారు. ప్రపంచ శాంతి సభలకు ఎందుకు అనుమతివ్వలేదని ఆయన ప్రశ్నించింది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతెలా ఇచ్చారు..? అని కేఏ పాల్ నిలదీశారు.
టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడంపైనా కేఏ పాల్ స్పందించారు. కేసీఆర్ పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ వంటిదని విమర్శించారు. బీజేపీలో చేరనందుకే ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం ప్రజలు తననే కోరుకుంటున్నారని కేఏ పాల్ అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.