
- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
తిమ్మాపూర్, వెలుగు: కబ్జాలకు పాల్పడి డబ్బులు సంపాదించాల్సిన అవసరం తనకు లేదని, ప్రపంచమంతా అభిమానులు ఉన్నారని, ఏ దేశం వెళ్లి పాట పాడినా రూ. కోటి సంపాదిస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కబ్జాలు, పైరవీలు అంటే తెలవదని, తనపై అసత్య ప్రచారాలు చేసేందుకు తలకు మాసినోళ్లు కొంతమంది మోపైయిండ్రని చెప్పారు. కేసీఆర్ మాట, రసమయి పాటతో తెలంగాణ అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నానని చెప్పారు. త్వరలోనే నియోజకవర్గానికి 1000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాబోతున్నాయని, ప్రభుత్వ స్థలం లేనందునే ఆలస్యం జరుగుతోందన్నారు. పూర్తయిన ఇండ్లను ఏప్రిల్, మే నెలల్లో అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి, జడ్పీటీసీ ఇనుకొండ శైలజ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
For More News..