ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పేదలకు ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంపై రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేంద్రం తీసుకున్న చర్యలతో జూన్, జూలై నెలల్లో ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల పై టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న పీయూష్ గోయల్..ఇథనాల్ సెంటర్లు ఏర్పాటు చేయలేదని చెప్పారు. కాగా పార్లమెంట్ వేదికగా తెలంగాణ వైఫల్యాలను లేవనెత్తుతానని లక్ష్మణ్ స్పష్టం చేశారు.