నిరూపిస్తే మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెపుతా

నిరూపిస్తే మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెపుతా
  • నన్ను చెడ్డదానిగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు నరేష్ ?
  • జీవిత రాజశేఖర్

హైదరాబాద్: నా మీద ఒక్క అలిగేషన్ నిరూపించండి... మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెపుతాననని జీవిత రాజశేఖర్ అన్నారు. మా అధ్యక్షుడుగా పనిచేసిన నరేష్ తననెందుకు చెడ్డదానిగా పనిచేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. నరేష్ నీకు ఎందుకింత కక్ష మా మీద అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియా సమావేశంలో జీవిత రాజశేఖర్ ఒకింత ఆవేశంగా.. ఉద్వేగంగా మాట్లాడారు. మా ఎన్నికల్లోకి నేను రాను అన్న నరేష్ ఇపుడు అర్జునుడు కృష్ణుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారని ఆమె నిలదీశారు. వీల్లు కొందరు ఫాన్స్ తో ఏవేవో చేయిస్తున్నారని.. సభ్యులు బెదిరి పోవాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు. 
ఎవరు మంచి చేస్తారో వారికే ఓటేయండి
ప్రస్తుతం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో జరుగుతున్న పరిణామాలు గమనించి ఎవరు మంచి చేస్తారో వారికి ఓటు వేయాలని జీవిత రాజశేఖర్ కోరారు. మా అసోసియేషన్ అంటేనే అందరూ అసహ్యించుకునే విధంగా నరేష్, విష్ణులు ప్రవర్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆడవాళ్లని ఆడవాళ్ళు ఎందుకు దిగజార్చుకోవడం అంటూ నటి కళ్యాణికి సూచనలు చేశారు. 
నరేష్ ఎలాంటి వాడో నాకు తెలుసు  
నరేష్ తో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి నరేష్ ఎలాంటి వాడో నాకు తెలుసునని జీవిత రాజశేఖర్ తెలిపారు. సభ్యులకు ఏమి కావాలో అది చేద్దాము.. అవే చెబుతామని ఆమె సూచించారు. మీరు సభ్యులను భయ పెడుతున్నారా ? ప్రకాష్ రాజ్ ఇక్కడ ఉండడు అంటున్నారు.. అయన లేకపోతే మేము వున్నాము కదా.. ? నరేష్ ఎప్పుడైనా వున్నాడా..?  మేము కదా చేసింది.. నా వరకు నేను ఎంత సిన్సియర్ గా పనిచేశానో చెపుతానన్నారు. నరేష్ అవకాశం ఇవ్వలేదు అందుకనే చాలా పనులు ఆగిపోయాయన్నారు. 
పృథ్వి భార్య నాతో మాట్లాడింది
పృథ్వీ భార్య నాతో మాట్లాడింది.. ఆమె మాట్లాడుతూ పృథ్వీకి మీరెంతో చేశారు అన్నపుడు సంతోషించానన్నారు. మా అధ్యక్షుడిగా నరేష్ చెప్పినట్లు చేశాం..దాంట్లో కొన్ని తప్పులు జరిగాయి.. నరేష్ అందరిని కలుపుకు పోలేదు.. ఇదే మా లో విభేదాలకు కారణమైందని జీవిత రాజశేఖర్ వివరించారు. ఎన్నిసార్లు చెప్పినా  నరేష్ పట్టించుకోలేదని, మా.. వెబ్ సైట్ క్రియేట్ చేద్దామని చెప్పా .. నరేష్ పెట్టలేదన్నారు. అలాగే ఫారిన్ ప్రోగ్రాం పై ఈసీ మీటింగ్ పెట్టమన్నందుకే .. మా లో గొడవ వచ్చింది. ఇదంతా నరేష్ పిచ్చితనంతోనే జరిగిందన్నారు. మా లో ఏ పని అన్నా ఆగింది అంటే కేవలం నరేష్ వలన మాత్రమేనని ఆమె ఆరోపించారు. నేను ఇల్లు కట్టకుండా అడ్డుపడ్డానా? ఇసుక ,రాళ్లు నేను తీసుకొచ్చనా?.. ఎందుకు ఒక లేడిని నన్ను టార్గెట్ చేస్తున్నారు..? నేను భాధ్యతతో పని చేస్తుంటే  నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు పని కట్టుకుని.. మీరు ఏమి చూసి భయపడుతున్నారని జీవిత ప్రశ్నించారు. 
నరేష్.. మీరు మాట్లాడే దానికి అర్ధం వుండాలి
నరేష్ గారు.. మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి.. మోహన్ బాబు,  విష్ణు మీరటే నాకు రెస్పెక్ట్ వుంది.. ఎందుకు నరేష్ సపోర్ట్ తీసుకుంటున్నారని జీవిత ప్రశ్నించారు. ఎన్నికల బరిలో రెండు ప్యానెల్స్ గా వున్నాము..  హెల్తీగా కాంటెస్ట్ చేద్దాము...  ప్రకాష్ రాజ్ ను లోకల్..  నాన్ లోకల్ అంటున్నారు.. మరి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎవరు ?  అయన ఇక్కడ వారు కాదే అని జీవిత ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ ని కలిశాను.. అయన కూడా మా లో జరుగుతున్న పరిణామాలను చూసి భాధ పడ్డారు.. నేను ఓటు వెయ్యడానికి రాను అని చెప్పారని జీవిత వివరించారు. 
మీరు ఏమి చెప్పాలని అనుకుంటున్నారు..? 900 మందిని  మీరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారా మాకే ఓటు వేయాలని ?? ఎలక్షన్స్ ముందు ఎందుకిన్ని డ్రామాలు.. ? ప్రకాష్ రాజ్ షూటింగ్ లో ఎవరినో బూతులు తిట్టారు అని అన్నారు.. మీరు కొట్టలేదా..? తిట్ట లేదా..? అని జీవిత నిలదీశారు.