- అమెరికా నుంచి రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ కోసం పోరాడి హోంగార్డు ఉద్యోగాన్ని కోల్పోయిన రంగారెడ్డి జిల్లా (పూర్వపు హబూబ్ నగర్ జిల్లా) ఆమనగల్లుకు చెందిన పూసల పరమేష్ దయనీయ పరిస్థితి గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని ఆయన ప్రస్తావించారు. పూసల పరమేష్ ఏంఏ, బీఈడీ చేసి హోంగార్డుగా పనిచేసేవాడు... సమైక్యాంద్ర, తెలంగాణ ఉద్యమాలు పతాక స్థాయికి చేరిన సమయంలో హోంగార్డు విధులను సైతం వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
జేఏసీ కన్వీనర్ గా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని పలుమార్లు లాఠీ దెబ్బలు తిని పీడీ యాక్టు ప్రయోగించడంతో జైలుపాలయ్యాడు. ఉద్యమంలో పరమేష్ పై చాలా కేసులు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అతడిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వీధి వ్యాపారిగా మారాడని, హోంగార్డు ఉద్యోగం కోసం ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఆయన వినతి ఇంకా నెరవేరలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి హోంగార్డు ఉద్యోగాన్ని కోల్పోయిన పూసల పరమేష్ ను తాను అమెరికా నుంచి వచ్చాక కలుస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి
తాగునీరు రావడం లేదని కలెక్టర్ను అడ్డుకున్నారు
6న ఇంటర్ గురుకుల ప్రవేశ పరీక్ష
లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు