![నేను రాజకీయాల్లోకి రాను: కేసీఆర్ మనవడు హిమాన్షు](https://static.v6velugu.com/uploads/2021/07/i-will-never-enter-politics-says-cm-kcr-grandson-and-minister-ktr-son-Himanshu-Rao-Kalvakuntladffdfdf_8jrwIHBT9X.jpg)
తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని.. రాజకీయాలు తనకు ఇష్టం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ప్రకటించాడు. ఈనెల 12న 16వ జన్మదినోత్సవం జరుపుకోబోతున్నాడు హిమాన్షు. ఈ నేపధ్యంలో కొద్దిసేపటి క్రితం ట్విట్ ద్వారా తన ఆకాంక్ష.. లక్ష్యాలు వేరని స్పష్టం చేశాడు. తన కలల ప్రపంచం.. లక్ష్యాలు వేరని, అందుకే రాజకీయాల్లోకి రాబోనని.. తన లక్ష్యాలు సాధించుకోవడంపైనే దృష్టి పెడుతున్నానని పేర్కొన్నాడు. ఈనెల 12న తన జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్బంగా తనకోసం ఎవరూ పూల బొకేలు పంపవద్దని.. దాని బదులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని హిమాన్షు కోరాడు.
I just wanted to clear something, I will never enter politics because I have my dreams to pursue and goals to achieve.
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 6, 2021
Thank you!
Hope you have a great day ?