చెప్పులు వేసుకోనన్న మాటను నిలబెట్టుకుంటున్న మంత్రి సత్యవతి

టీఆర్ఎస్ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనన్న మంత్రి సత్యవతి రాథోడ్ దాన్ని తూ.చా. తప్పక పాటిస్తున్నారు. హైదరాబాద్‌లో గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవ సందర్భంగా భావోద్వేగానికి గురైన మంత్రి సత్యవతి రాథోడ్‌...  టీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చే వరకు తాను చెప్పులు తొడగనని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఆమె అప్పట్నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా చెప్పులు వేసుకోకుండానే వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవంలోనూ సత్యవతి చెప్పులు లేకుండానే కనిపించారు. 

ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ సైతం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా అక్కడి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలోనూ ఆమె చెప్పులు వేసుకోకుండా నడుస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాళ్లకు చెప్పులు లేకుండా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.