- బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్
బోధన్ (నిజామాబాద్), వెలుగు: బోధన్ లో రోహింగ్యాలు లేరని, ఉన్నట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సవాలు విసిరారు. బంగ్లాదేశీయులు అక్రమంగా మన దేశంలోకి చొరబడి నకిలీ పాస్ పోర్టులు తీసుకుంటుంటే.. కేంద్రం , సెక్యూరిటీ బలగాలు, నిఘావర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మంగళవారం బోధన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. పాస్ పోర్టుల ఇష్యూ స్టేట్పరిధిలోది కాదన్నారు. ఎవరైనా పాస్ పోర్టుకు అప్లయ్ చేస్తే .. గ్రౌండ్ లో వెరిఫై చేసి రిపోర్టును పాస్ పోర్టు ఆఫీసుకు పంపించడమే పోలీసుల బాధ్యత అని చెప్పారు. ఒకే ఇంటి అడ్రస్ పై 32 పాస్ పోర్టులు తీసుకుంటుంటే.. పాస్‌పోర్టు ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బార్డర్ లో సరైన సెక్యూరిటీ లేకపోవడంతో బంగ్లాదేశీయులు మన దేశంలోకి ఎంటర్ అవుతున్నారని అన్నారు. ముందుగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్‌లోకి చొరబడి అక్కడ ఆధార్‌కార్డులు తీసుకుని.. తెలంగాణలోకి వస్తున్నారని అన్నారు. బోధన్‌లో అడ్రస్, ఇంటి నంబర్మార్చేసి.. నకిలీ పాస్ పోర్టులు పొందినట్టు తెలిపారు. ఎంపీ అర్వింద్ సీఎం కేసీఆర్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.
ఇవి కూడా చదవండి
మంత్రి గంగుల పిటిషన్.. సర్కారుకు నోటీసులు