నువ్ కొడంగల్‌లో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..: కేటీఆర్

నువ్ కొడంగల్‌లో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..: కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో రాజీనామా చేసి, తమ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొడంగల్‌లో కురక్షేత్ర యుద్ధం నడుస్తోందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని ఆరోపించారు. సోమవారం(ఫిబ్రవరి 10) కోస్గిలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలు మా ఎమ్మెల్యే సీఎం అయితే మాకు మంచి చేస్తారని అనుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని, భూములు గుంజుకో వడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని, అనుముల అన్నదమ్ములు, అదానీల కోసమే పనిచే స్తున్నారన్నారు. రూ.కోట్లు దోచిపెట్టేందుకే పనిచేస్తున్నారని మండిపడ్డారు.