వరంగల్ ఎంపీగా 2 లక్షల మోజార్టీతో గెలుస్త : ఆరూరి రమేష్

కేంద్రంలో మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్.  అధికార పార్టీ డబ్బు, మద్యం పంపి ఓటర్లను కొనే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.  ఆ డబ్బులు తీసుకొని బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.  రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ నీచమైన ప్రచారం చేస్తోందన్నారు.  వెన్నులో వణుకు పుట్టి మోదీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ కల్లబొల్లి, మోసపూరిత మాటలు నమ్మోద్దని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయలేదని..  ఇప్పుడు ఏమీ చేయలేక కాంగ్రెస్ నేతలు గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు.  రేవంత్ రెడ్డి నెంబర్ 1 గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు.  మోదీ గ్యారెంటీతో మేము ధీమాగా ఉన్నామని చెప్పుకొచ్చారు.  2 లక్షల మెజారిటీతో వరంగల్ ఎంపీగా తాను గెలుస్తానని వెల్లడించారు.