2 లక్షలకుపైగా ఓట్లతో విజయం సాధిస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

2 లక్షలకుపైగా ఓట్లతో విజయం సాధిస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్​కు కాలం చెల్లిందని, దేశమంతా మోదీ హవా నడుస్తోందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ12 నుంచి15 స్థానాల్లో విజయం సాధించబోతుందని పేర్కొన్నారు. శంకర్​పల్లి బీఆర్ ఎస్ నేత, ఎంపీపీ ధర్మాన్నగారి గోవర్ధన్ రెడ్డి శనివారం బీజేపీలో చేరగా ఆయనకు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  

అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా చేవెళ్ల ప్రజలు తన వెంట నిలిచారని పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతోనే తాను చేవెళ్లలో 2 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, తన పేరుతో పది మంది అభ్యర్థులను నిలబెట్టి ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నాడని, కుట్రలను చేవెళ్ల ప్రజలు సమర్థవంతంగా తిప్పికొడతారని  చేవెళ్ల  బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి  సూచించారు. వికారాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వికారాబాద్ లో అమిత్ షా సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు.