వికారాబాద్, వెలుగు: ఐదేండ్లుగా చేవెళ్ల ప్రాంత ప్రజల పరిరక్షణే ధ్యేయంగా పని చేశానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 50 రోజులుగా ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
మతతత్వ బీజేపీ కావాలా..? లేదా లౌకిక వాద సెక్యులర్ కాంగ్రెస్ కావాలా..? ప్రజలే ఆలోచించుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. సోమవారం జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్, మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.