మళ్లీ డిబేట్‌ అక్కర్లే.. నేనే గెలిచిన: డొనాల్డ్ ట్రంప్‌

మళ్లీ డిబేట్‌ అక్కర్లే.. నేనే గెలిచిన: డొనాల్డ్ ట్రంప్‌

వాషింగ్టన్: ఇటీవల డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో జరిగిన డిబేట్‌లో తానే గెలిచానని, కానీ సర్వేలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మండిపడ్డారు. ఆమెతో మరోసారి చర్చకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఓడిపోయిన వాళ్లే మళ్లీ డిబేట్‌ అవసరమని అడుగుతారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో పోస్ట్‌ చేశారు.

‘నేను మూడో చర్చకు సిద్ధంగా లేను’ అని ట్రంప్ అందులో పేర్కొన్నారు. కాగా.. అధ్యక్ష రేసులోంచి బైడెన్‌ వైదొలగకముందు ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి డిబేట్‌ జరిగింది. తాజాగా ట్రంప్‌, హారిస్‌ల మధ్య రెండో సంవాదం జరిగింది. దీంతో ఆయన మూడో డిబేట్‌కు సిద్ధంగా లేనని ప్రకటించారు.