చైనా, నార్త్ కొరియా, ఇరాన్​లో ఇన్ఫార్మర్లు కావలెను .. వీడియో షేర్ చేసిన సీఐఏ

చైనా, నార్త్ కొరియా, ఇరాన్​లో ఇన్ఫార్మర్లు కావలెను .. వీడియో షేర్ చేసిన సీఐఏ

వాషింగ్టన్:  చైనా, నార్త్ కొరియా, ఇరాన్ లో ఇన్ఫార్మర్లు కావాలని కోరుతూ అమెరికా నిఘా సంస్థ సెంట్రల్  ఇంటెలిజెన్స్  ఏజెన్సీ (సీఐఏ) ఒక వీడియోను విడుదల చేసింది. ఎక్స్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం, టెలిగ్రాం, ఫేస్ బుక్, లింక్డ్ ఇన్, డార్క్ వెబ్ లో ఈ వీడియోను మాండరిన్, కొరియన్, పార్సీ భాషల్లో రిలీజ్  చేసింది. ‘‘ఆసక్తి గలవారు సంప్రదించండి. మీ భద్రత, సంక్షేమమే మా ప్రాధాన్యం.

 మీ దేశాల్లో  పరిస్థితులు మీకు తెలుసు.  సమాచారం ఇస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీరు సీక్రెట్ నెట్ వర్క్  ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు” అని ఆ వీడియోలో సీఐఏ పేర్కొంది. కాగా.. డబుల్  ఏజెంట్లుగా పనిచేసేందుకు రష్యా గూఢచారులు కావాలంటూ ఈ ఏడాది జవనరిలోనూ సీఐఏ ఒక వీడియోను విడుదల చేయడం గమనార్హం. 

ALSO READ | గాజా వైమానిక దాడిలో హమాస్ చీఫ్ మృతి..3నెలల తర్వాత ఇజ్రాయెల్ ప్రకటన..