ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో: ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ( డిసెంబర్ 8, 2024 ) ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించారు. 4 :30 గంటలకు మొదలైన ఈ ఎయిర్ షోలో  దాదాపుగా 30 నిమిషాల పాటు వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.నెక్లెస్ రోడ్, హెచ్ఎండీయే గ్రౌండ్స్‎లో జరిగిన ఈ కార్యక్రమానికి సందర్శకులు పెద్దఎత్తున వచ్చారు. వీకెండ్ కావడంతో నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చారు.

ఎయిర్ షోకు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, అంజలితో పాటు మరికొందరు సినీ నటులు హాజరయ్యారు. అంతేకాకుండా.. హెచ్ఎండీఏ గ్రౌండ్స్‎లో హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ స్టాళ్ళు ఏర్పాటు చేశారు. అనంతరం ఐమాక్స్ గ్రౌండ్స్‎ లో ప్లాన్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్‎ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.

Also Read:-నడవలేని స్థితిలో మంచు మనోజ్‌.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స..!

ఈ కార్యక్రమానికి  భారీ స్పందన వస్తుందని అంచనా వేసిన అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.