హర్యానాలో కూలిన ఆర్మీ జెట్ ఫైటర్

హర్యానాలో కూలిన ఆర్మీ జెట్ ఫైటర్

హర్యానాలో ఆర్మీయుద్ద విమానం కూలింది.శుక్రవారం(మార్చి7)అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ నుంచి బయల్దేరిని భారత వైమానికి దళం (IAF) కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం  పంచకులలో కుప్పకూలింది. పైలట శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పైలట్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి  IAF అధికారులు తెలిపారు. 

‘‘శుక్రవారం అంబాలా దగ్గర IAF కి చెందిన జాగ్వార్ విమానం శిక్షణలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తడంతో కూలిపోయింది..విమానాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా నడిపి పైలట్ సురక్షితంగా దూకేశాడు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి IAF విచారణకు ఆదేశించింది’’అని భారత వైమానిక దళం అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది.