![మధ్యప్రదేశ్‌లో కూలిన ఐఏఎఫ్ యుద్ధ విమానం..ఇద్దరు పైలట్లకు గాయాలు](https://static.v6velugu.com/uploads/2025/02/iafs-mirage-2000-fighter-aircraft-crashes-in-madhya-pradeshs-shivpuri-pilots-injured_I4P0oUM5qT.jpg)
మధ్యప్రదేశ్‌లో ఐఏఎఫ్‌కు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. గురువారం(ఫిబ్రవరి 6) ని శివపురి సమీపంలో శిక్షణా కార్యక్రమంలో ఉండగా రెండు సీట్ల మిరాజ్ 2000 యుద్ధ విమానం కుప్పకూలింది.
అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు స్వల్పగాయాలతో బయటపడినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశిస్తున్నట్లు రక్షణ అధికారులు తెలిపారు.
ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నిర్మించిన ఈ మల్టీరోల్ ఫైటర్ జెట్ మిరాజ్ 2000 1978లో మొదటిసారిగా ఎగిరింది. 1984 లో ఫ్రెంచ్ వైమానిక దళం దీనిని ప్రవేశపెట్టింది. 600 మిరాజ్ 2000 లను ఉత్పత్తి చేశారు. వీటిలో 50 శాతం భారతదేశంతో సహా ఎనిమిది దేశాలకు ఎగుమతి చేశారు.