Ian Chappell: ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా అవసరమా..? ఐసీసీకి ఆస్ట్రేలియా దిగ్గజం సూటి ప్రశ్న

Ian Chappell: ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా అవసరమా..? ఐసీసీకి ఆస్ట్రేలియా దిగ్గజం సూటి ప్రశ్న

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అసోసియేట్ దేశాలకు టెస్ట్ హోదా ఇవ్వడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సంతృప్తిగా లేనట్టు కనిపిస్తుంది. అసోసియేట్ దేశాలకు టెస్ట్ హోదా అవసరం లేదని ఆయన పరోక్షంగా తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఒక దేశానికి టెస్ట్ హోదా ఇవ్వడానికి ముందు నిర్దిష్ట ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చాపెల్ అన్నాడు. 

"ప్రస్తుతం తాలిబాన్ పాలనలో ఉన్న తమ దేశంలో ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్ సిరీస్‌లకు ఆతిథ్యమివ్వగలదా..? అదేవిధంగా ఐర్లాండ్‌లో తగినంత టెస్ట్-స్టాండర్డ్ స్టేడియాలు ఉన్నాయా..? అని ఈ ఆసీస్ దిగ్గజం ఐసీసీని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్లు రాజ్యమేలుతున్నారు. అలాంటప్పుడు ఆ దేశానికి ఐసీసీ టెస్ట్ హోదా ఎందుకు ఇచ్చారు. అసోసియేట్ దేశాలకు ఏ సహేతుకమైన ప్రమాణాలను పాటించకుండా టెస్ట్ హోదా ఇచ్చారు". అని చాపెల్ ఆందోళన వ్యక్తం చేశాడు. 

ALSO READ | Smriti Mandhana: ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా స్మృతి మంధాన

ఒక జట్టు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నత ఆట కొసాగిస్తే టెస్ట్ హోదాకు ఆజట్టు అర్హత సాధిస్తుందని.. ఇటీవలి టెస్ట్ నియమించిన దేశాలకు అలాంటి అత్యున్నత ఆట ప్రదర్శిందని నేను అనుకోవట్లేదని చాపెల్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు వలన టెస్ట్ క్రికెట్ కు ప్రయోజనం  కలుగుతుందని ఆయన అన్నారు.  చేకూరుస్తాయని అతను పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లకు 2018లో టెస్ట్ హోదా లభించింది. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడి నాలుగు గెలిచింది. మరోవైపు ఐర్లాండ్ 9 టెస్ట్ మ్యాచ్ లు ఆడి రెండు గెలిచింది.