హైదరాబాద్, వెలుగు: ఎల్బీ స్టేడియంలో ఈ నెల 14న నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాల ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లను ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ డాక్టర్ ఎస్.హరీశ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకటరావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహించనున్న మొదటి కార్యక్రమం అన్నారు. సీఎం, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
విద్యార్థుల కోసం డైట్ చార్జీల పెంపు, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటి గ్రేటడ్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలకు ఉచిత కరెంట్ తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేశారు. దాదాపు 14 వేల మంది పాఠశాల విద్యార్థులతో విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు, ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.