
- ఆస్తులు వెల్లడించి వారిలో..
- స్మితా సబర్వాల్, యోగితా రాణా, జయేష్ రంజన్, సంజయ్ జాజు, స్టీఫెన్ రవీంద్ర, క్రిస్టినా జడ్ చోంగ్తూ
- ఇప్పటికీ వివరాలు వెల్లడించని ఆరుగురు
- జనవరి-2025తో ముగిసిన డీవోపీటీ గడువు
- సీఎస్ శాంతికుమారికి జూబ్లీహిల్స్ లో ఇల్లు
- రాష్ట్రంలోని 174 మంది ఐఏఎస్ లు, 128 మంది ఐపీఎస్ లు
హైదరాబాద్: తెలంగాణలోని పలువురు అధికారులు తమకు ఆస్తులు లేవని డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)కు అఫిడవిట్లు సమర్పించారు. ఇలా ఆస్తుల్లేవని చెప్పిన అధికారుల్లో స్మితా సబర్వాల్, యోగితారాణా, జయేశ్ రంజన్, క్రిస్టినా జడ్ చోంగ్తూ, సంజయ్ జాజూ, స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తనకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ లో ఒక ఇల్లు ఉందని తెలిపారు. 126 ప్లాట్ నంబరులో 501.87 ఆ ప్లాట్ విలువ ప్రస్తుతం 75 లక్షలని డీవోపీటీకి తెలిపారు. తన భర్త భాస్కర్ సంజయ్ పేరిట రాజేంద్రనగర్ పీరం చెరువు సర్వేనంబరు 167 వద్ద 1244 గజాల స్థలం ఉందని చూపించారు. దానిని తన తండ్రి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్టు పేర్కొన్నారు.
వివరాలు ఇవ్వని ఆరుగురు
తమపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇవ్వాలన్న డీవోపీటీ ఆదేశాలకు ఆరుగురు ఆఫీసర్లు స్పందిచలేదు. వారిలో ఐఏఎస్ అధికారులు చిట్టెం లక్ష్మి, ఫైజాన్ అహ్మద్, అశ్విన్ తానాజీ తో పాటు ఐపీఎస్ అధికారులుఎం శ్రీనివాసులు, డి ఉదయ్ కుమార్ రెడ్డి, రుత్విక్ సాయి కొట్టె ఉన్నారు.
వారసత్వంగా వచ్చిన ఆస్తులున్నయ్
సీవీ ఆనంద్, అవినాష్ మహంతి కూడా వారసత్వపు ఆస్తులున్నాయని రికార్డుల్లో సూచించారు.ఐపీఎస్ అధికారి డీజీపీ జితేందర్ తనకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు వచ్చాయని తెలిపారు.చాలా మంది ఐపీఎస్ అధికారుల ఆస్తులు తల్లిదండ్రుల లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తులున్నాయని డీవోపీటీకి వెల్లడించారు. హెచ్ఎండీఏ కమిషనర్ మీజూరి దాన కిషోర్ తన వారసత్వ ఆస్తులను ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కుద్రి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, సింగిల్ ఫ్లోర్ ఇల్లు వచ్చాయని తెలిపారు. వీటితో పాటు తన భార్య పేరిట ఉన్న పలు ఆస్తులను ప్రస్తవించారు.
►ALSO READ | ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ నుంచి 15% వస్తువులు కొనాలి.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిక్వెస్ట్