ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలకు IAS కౌంటర్

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలకు IAS కౌంటర్

యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే నారాయణమూర్తి వ్యాఖ్యలపై నెటిజన్లలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది భారతదేశంలోని యువ శ్రామిక శక్తి, కార్పొరేట్ ఇండియా మద్య ఉన్న అంచనాల వ్యత్యాసాన్ని స్పష్టంగా హైలెల్ చేసింది. కొంతమంది వ్యాపార వేత్తలు నారాయణ మూర్తి అభిప్రాయాలను ఆమోదించగా.. పలువురు సోషల్ మీడియాలో ఆయన అభిప్రయాలను విమర్శించారు. తక్కువ వేతనం, పని జీవితంలో సమతుల్యత లేకపోవడం గురించి ఆందోళ వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలపై IAS అశోక్ ఖేమ్కా స్పందించారు. ఐటీ కంపెనీల్లోని ఫ్రెషర్స్ ,CEOల వేతనాన్ని కంపేర్ చేస్తూ ట్వీట్ చేశారు.ఇన్ఫోసిస్ సీఈవో కి 2012లో రూ. 80 లక్షలిస్తే.. 2022లో రూ. 79.75 కోట్లు శాలరీ ఇచ్చారు. అదే ఫ్రెషర్ కు రూ. 2.75 లక్షల నుంచి రూ. 3.60 లక్షలకు మాత్రమే పెంచారు. ఇద్దరూ సమాన గంటలు పనిచేసినా.. 2,200 రెట్ల వ్యత్యాసం ఎందుకుందని ప్రశ్నించారు.