
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్, ఐపీఎస్ లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఆరుగురు ఐఏఎస్ లను స్పెషల్ సీఎస్ లుగా చేసిన సర్కార్ .. ఆరుగురు ఐపీఎస్ లను అదనపు డీజీలుగా ప్రమోట్ చేసింది. మొత్తంగా 26 మంది ఐఏఎస్ లు, 23 మంది ఐపీఎస్ లకు ప్రమోషన్లు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసు కుని ప్రమోషన్లను ఇచ్చింది సర్కార్ . మిగతా ఐఏఎస్ లలో ఒకరిని ప్రిన్సి పల్ సెక్రటరీగా, నలుగురిని సెక్రటరీలుగా, ఆరుగురిని అడిషనల్ సెక్రటరీలుగా, ఐదుగురిని జాయింట్ సెక్రటరీలుగా, నలుగురిని డిప్యూటీ సెక్రటరీలుగా ప్రమోట్ చేసింది.
1988వ బ్యాచ్ ఐఏఎస్ అధికారులు అధర్ సిన్హా , శాలిని మిశ్రా, 1989 బ్యాచ్ కు చెంది న సోమేశ్ కుమార్ లకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి లభించింది. వారు ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న 1987వ బ్యాచ్ అధికారులు రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988వ బ్యాచ్ అధికారి రాణికు ముదినిలకూ స్పెషల్ సీఎస్ లుగా పదోన్నతి కల్పించింది. 1994 బ్యాచ్ అధికారి సవ్యసాచి ఘోష్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోట్ చేసింది. 2003 బ్యాచ్ అధికారులు యోగితా రాణా, డీ లోకేశ్ కుమార్, టీ విజయ్ కుమార్, పీ సత్యనారాయణరెడ్డికి సెక్రటరీలుగా, 2005 బ్యాచ్ అధికారి ఎం చంపాలాల్, 2006 బ్యాచ్ అధికారులు బీ భారతీ లక్ పతి నాయక్, బీ విజేంద్ర, కేవై నాయక్, కే సురేంద్ర మోహన్, డీ రోనాల్డ్ రాస్ కు అడిషనల్ సెక్రటరీలుగా, 2010 బ్యాచ్ అధికారులు ఆమ్రపాలి కాటా, డీ దివ్య, భారతి హోలికేరి, హరి చందన, ప్రీతి మీనాకు జాయింట్ సెక్రటరీగా, 2015 బ్యాచ్ అధికారులు అనురాగ్ జయంతి, పీ గౌతమ్, పమేలా సత్పతి, రాహుల్ రాజ్ కు డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతి కల్పించింది.
అడిషనల్ డీజీలుగా…
1994వ బ్యాచ్ కు చెందిన ఆరుగురు ఐపీఎస్ లకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించింది . ఐజీపీలుగా ఉన్న అప్టె వినాయక్ ప్రభాకర్, కే శ్రీనివాసరెడ్డి, బీ శివధర్ రెడ్డి, డాక్టర్ సౌమ్యా మిశ్రాతో పాటు హైదరాబాద్ అదనపు సీపీ (క్రైమ్స్)గా పనిచేస్తున్న షికా గోయల్, అభిలాష్ బిష్త్లను అదనపు డీజీలుగా ప్రమోట్ చేసింది . 2001కి బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ లు, డీఐజీలుగా పనిచేస్తున్న అకున్ సబర్వాల్, సుధీర్ బాబు, ప్రభాకర్ రావ్, ప్రమోద్ కుమార్ లకు ఐజీలుగా ప్రమోషన్ వచ్చింది . 2004 బ్యాచ్ కు చెందిన వీ శివకుమార్, వీబీ కమలాసన్ రెడ్డి, ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ లను డీఐజీలుగా, 2005 బ్యాచ్ కు చెందిన ప్రస్తుతం డీసీపీలుగా పనిచేస్తున్న అవినాష్ మహంతి, సెం ట్రల్ జోన్ డీసీపీ పీ విశ్వప్రసాద్, ఈస్ట్ జోన్ డీసీపీ ఎం రమేశ్ లకు డీఐజీలుగా పదోన్నతి కలించింది. ఈ ముగ్గురూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జాయింట్ సీపీ హోదాలో కొనసాగనున్నారు. దీంతో పాటు 2006వ బ్యాచ్ కు చెందిన కార్తికే య, కే రమేశ్ నాయుడు, వీ సత్యనారాయణ, బి సుమతి, ఎం శ్రీనివాసులు, ఏ వెంకటేశ్వర రావులకు సీనియర్ స్కేల్ అధికారులుగా ప్రమోషన్ దక్కింది.