బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఐటీడీఏ నర్సరీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, ఐఏఎస్ కుష్బూ గుప్తా తెలిపారు. ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టిన ఆమె శుక్రవారం సాయంత్రం మొదటిసారిగా బెల్లంపల్లి ఐటీడీఏ ఉద్యాన నర్సరీతో పాటు రోజ్ గార్డెన్లను పీఓ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 120 ఎకరాల్లో విస్తరించి ఉన్న నర్సరీని పూర్తిస్థాయిలో నర్సరీని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రాజెక్టు హార్టికల్చర్ ఆఫీసర్సందీప్ కుమార్తో పాటు బెల్లంపల్లి టెక్నికల్ అసిస్టెంట్ పూజను ఆదేశించారు. ఆమె వెంట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సీసీ వసంత్, సిర్పూర్ పేపర్ మిల్లు అసిస్టెంట్ మేనేజర్ దేవరాజ్, సిబ్బంది రాజమల్లు, రాహుల్ తదితరులు ఉన్నారు.