శివబాలకృష్ణ ల్యాండ్ స్కాంలో.. ఐఏఎస్ అరవింద్ కుమార్

శివబాలకృష్ణ ల్యాండ్ స్కాంలో.. ఐఏఎస్ అరవింద్ కుమార్

 హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కన్ఫెషన్  రిపోర్ట్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. రిపోర్టులో శివబాలకృష్ణ ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును ప్రస్తావించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ తనకు కావాల్సిన బిల్డింగ్లకు తన ద్వార అనుమతులు జారీ చేయించుకున్నట్టు శివబాలకృష్ణ ఒప్పుకున్నారు. నార్సింగిలోని ఒక కంపెనీకి చెందిన వివాదాస్పద భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చానని శివబాలకృష్ణ ఒప్పుకున్నారు. నార్సింగ్ లోని ఎస్ఎస్వీ ప్రాజెక్ట్ అనుమతి కోసం ఐఏఎస్ అరవింద్ కుమార్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారని డిమాండ్ చేసిన రూ. 10 కోట్లలో రూ. కోటి షేక్ సైదా చెల్లించారని అంగీకరించారు.

జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి బాలకృష్ణ  రూ. కోటి ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. అరవింద్ కుమార్ మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం రూ. కోటి డిమాండ్ చేశారని అంగీకరించారు. మహేశ్వరం మండల్ మంకల్ వద్ద వర్టేక్స్ భూములకు సంబంధించిన వ్యవహరంలో కంపెనీకి అర్వింద్ కుమార్, శివబాల కృష్న ఫేవర్ చేసినట్టు ఒప్పుకున్నారు.  ఫలితంగా వర్టెక్స్ హోంలో ఒక ప్లాట్ ను అరవింద్ కుమార్ పేరిట బహుమానం ఇచ్చారని కన్ఫెషన్ రిపోర్టులో తెలిపారు.