గవర్నర్​ ప్రిన్సిపల్ ​సెక్రటరీగా దానకిషోర్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ దాన కిషోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సీఎస్​ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఇప్పటికే పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా దాన కిషోర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన్ను గవర్నర్ జష్ణుదేవ్ వర్మకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.