ఐఏఎస్ అధికారి మంత్రి కాళ్లు పట్టుకోవడం అవమానకరం

ఐఏఎస్ అధికారి మంత్రి కాళ్లు పట్టుకోవడం అవమానకరం
  • ఐఏఎస్ వ్యవస్థకే అవమానకరం
  • ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించి తగిన మందు వేయాలి
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

మంత్రులు, రాజకీయ నేతలు ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ రిటైర్ అయ్యే వరకు దేశాన్ని ఉక్కు కవచంలా కాపాడాల్సిన బాధ్యత ఐఏఎస్ లు, ఐపీఎస్ లపై ఉందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా ఉన్న ఐఏఎస్ అధికారి బహిరంగంగా మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకోవడం ఐఏఎస్ వ్యవస్థకే అవమానకరం అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రిటైర్ అయ్యే వరకు గౌరవనీయమైన బాధ్యతలోనే ఉంటారు తప్ప అగౌరవనీయమైన దాంట్లో ఉండే అవకాశమే లేదన్నారు. అలాంటప్పుడు పబ్లిక్ లోనే మంత్రి కాళ్లు పట్టుకోవడం ఐఏఎస్ వ్యవస్థకే అవమానకరం అన్నారు. ఆయన పేరు ఉచ్చరించడం కూడా ఇష్టంలేదంటూ..  ఇలాంటి చీడ పురుగుల గురించి ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించి ఖండించడమే కాదు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించాలన్నారు. ఒక జాయింట్ కలెక్టర్ కే కాదు.. ఐఏఎస్ వ్యవస్థకే అవమానకరమైనది కాబట్టి అధికారులు స్పందించి తగిన మందు వేయాలని సీపీఐ నారాయణ కోరారు.