బార్మర్: రాజస్థాన్లోని బార్మర్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ‘స్పా’ పేరుతో వ్యభిచార గృహం నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి సెక్స్ రాకెట్ బట్టబయలైన ఘటనలకు సంబంధించి గతంలో చాలా వార్తలే వచ్చాయి కదా.. ఇందులో పెద్ద వింతేముంది అనుకోవచ్చు. ఈ వ్యభిచార ముఠా ఆటకట్టించింది పోలీసులు కాదు. జిల్లా కలెక్టరే నేరుగా రంగంలోకి దిగి సెక్స్ రాకెట్ను ఛేదించారు.
ALSO READ | దడ పుట్టిస్తోన్న డిజిటల్ అరెస్ట్‌లు.. కొత్త తరహా క్రైమ్‌కు తెరలేపిన సైబర్ క్రిమినల్స్
గత నెలలో (సెప్టెంబర్, 2024) రాజస్థాన్లోని బార్మర్ జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ అధికారి టీనా దాబీ బాధ్యతలు స్వీకరించారు. నెల రోజుల్లోనే అసాంఘిక శక్తులపై ఆమె ఉక్కుపాదం మోపారు. క్లీనింగ్ క్యాంపెయిన్లో భాగంగా ఆమె సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బుధవారం ఆమె పర్యటించారు. ఆ సందర్భంలో ఒక స్పా సెంటర్ ఆమె కంటపడింది.
बाड़मेर जिला मुख्यालय पर स्पा कि आड़ में अनैतिक कार्य करवाया जा रहा है
— Jabar Singh Barhath 🇮🇳 (@Jabarsingh_) October 9, 2024
जिला कलक्टर @dabi_tina जी से निवेदन कि स्पा सेंटर को पूर्ण रूप से बंद करवाया जाए व समय समय पर पर पुलिस द्वारा निरीक्षण करवाया जाए ,@BarmerDm @Barmer_Police @RajCMO @BhajanlalBjp @DrPremBairwa @KumariDiya pic.twitter.com/d42U6Crx1v
ఆ స్పా సెంటర్ లోపలి వైపు లాక్ చేసి ఉందని గుర్తించిన ఆమె నేరుగా అక్కడికి వెళ్లి స్పా సెంటర్ డోర్ కొట్టింది. పలుమార్లు డోర్ కొట్టినా ఎవరూ తీయకపోవడంతో ఆమెకు అనుమానమొచ్చింది. ఇదేదో తేడా వ్యవహారమని ఫిక్స్ అయిన ఆమె పోలీసుల సాయంతో డోర్ బద్ధలు కొట్టించారు. ఆ స్పా సెంటర్ లోపలికి వెళ్లి చూడగా రూమ్స్ కనిపించడంతో కలెక్టర్, పోలీసులు విస్తుపోయారు. ఆ గదుల్లో అభ్యంతరకర స్థితిలో ఐదుగురు యువతులు, ఇద్దరు విటులు కనిపించారు. పోలీసులు ఆ యువతులను, ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఘటనను కలెక్టర్ సమక్షంలో కెమెరాల్లో రికార్డ్ చేశారు. దీంతో.. దొరికిపోయిన ఆ యువతులు ముఖం కవర్ చేసుకుంటూ ఉన్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.