
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్‌పేట మండలంలోని దేవరయాంజాల్ సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాపై విచారణ జరిపిన ఐఏఎస్ ల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. మొత్తం1,350 ఎకరాల భూములు దేవాలయానివేనని కమిటీ తెలిపింది.
ఈ భూములు కబ్జా అయ్యాయని, అక్రమ నిర్మాణాలు వెలిశాయని, కబ్జాలను తొలగించి, భూములను దేవాలయానికి అప్పగించాలని కమిటీ రిపోర్టులో తెలిపింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ చేపట్టింది. పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో నల్గొండ, మంచిర్యాల, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారు.